Homeతెలంగాణవినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి...

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి…

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు భీంగల్‌లో నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్బంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. భీంగల్‌లోని సహస్ర కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగిన సమావేశానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మండపాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, రహదారులకు ఇబ్బంది కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టమ్ వినియోగించాలని స్పష్టం చేశారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, నిమజ్జన ఊరేగింపులో యువత సంయమనం పాటించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, వదంతులను ప్రచారం చేయవద్దని, అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ సమావేశంలో సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు సిహెచ్. తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొని ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, పోలీసుల సూచనలు వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, మున్సిపల్ కమీషనర్ గజానంద్, మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి, బోదిరే స్వామి, వైస్ చైర్మన్ సంటి లత, జేజే నర్సయ్య, మోర్తాడ్ ఎస్సై రాము, వేల్పూర్ ఎస్సై సంజీవ్, ఎర్గట్ల ఎస్సై రాజేశ్వర్, కమ్మర్ పల్లి ఎస్సై సతీష్ ఏ ఎస్సై అబ్దుల్ సత్తార్, ట్రాన్స్ కో ఏఈ సత్యప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్, బోదిరే లావణ్య, (నర్సయ్య), మల్లెల అనుపమ ( ప్రసాద్ ), సంగ్యా నాయక్, నీలం రవి, సందీప్, పర్శ కుశలత, గున్నాల లక్ష్మి, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్....

0
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,...

20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…

0
20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన సమావేశం అనివార్య కారణాల...

లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్…

0
లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: ఎన్‌ఎండీసీ 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున ప్రతిభ కనబరిచిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణను...

పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్…

0
పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 నాలుగో సవరణ బిల్లు–2026కు...

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు…

0
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు ...

Translate »
error: Content is protected !!