వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 1,500 మంది భక్తులు కుంకుమార్చన పూజల్లో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు, వాసవి సంఘ సభ్యులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ముగులపల్లి భూమేశ్ గుప్తా మాట్లాడుతూ భక్తుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూర శ్రీనివాస్, వలిబిశెట్టి భాస్కర్, రమేష్ గుప్తా, పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, వాసవి కన్యకా పరమేశ్వరి సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























