ధర్పల్లిలో గ్రామ దేవతలకు ఘనంగా ముడుపు విప్పి పూజలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి గ్రామంలో గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో ముడుపు విప్పి ప్రత్యేక పూజా కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ ఆర్మూర్ రంజిత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సుభాష్, చక్రపాణి, చెలిమిల నరసయ్య, మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ విడిసి సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.























