ధర్పల్లి మండలంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన రజకులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర చిరస్మరణీయమని, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జా శ్రీకాంత్, సుభాష్, చక్రపాణి, చెలిమెల నరసయ్య, డాక్టర్ నందు. హమీద్. మరియు రజక కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.























