నందిపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ సెప్టెంబర్ 10 త్రిశూల్ న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె 41వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంటల గవస్కర్ మాట్లాడుతూ….. వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ పోరాట పటిమను, పీడిత ప్రజల విముక్తి కొరకు ఆమె చూపిన తెగువను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఐలమ్మకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని, ఆమె ధైర్య సాహసాలను ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకోవాలని సాటివారి కష్టాలను తీర్చేందుకు నడుం బిగించినదుకే ఆమె ఈరోజు వీరవనితగా నీరజాలు అందుకుంటుందని, ఆమె మా రజక జాతిలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు. జేఏసీ నాయకులు రైతు కూలి గంగన్న, జిల్లా రజక సంఘం నాయకులు ఎండ్రాల గంగాధర్, టిఆర్ఎస్ నాయకులు కొండూరు సంతోష్, మన్పూర్ భూమేష్, మండల రజక సంఘం ఉపాధ్యక్షులు బాద్గున సాగర్, నిమ్మల ఆనంద్, పాతూరు సాగర్, కుంటాల గంగాధర్, బాద్గుణ చిన్న సాయన్న, దేవన్న, సోర్పెట్ సాయన్న, సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.























