నందిపేట్‌లో 16వ వార్డులో సర్పంచ్ మార్నింగ్ వాక్
వార్డులో ప్రజా సమస్యలపై ఆరా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి…
నందిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని 16వ వార్డులో సర్పంచ్ ఎర్రం లింగం శుక్రవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా సంబంధిత వివరాలను సేకరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతోంది.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యుడు నరేష్, కరోబార్లు, గ్రామపంచాయతీ వాటర్‌మ్యాన్ రఫీక్ మహబూబ్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొ న్నారు.

























