కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు భీంగల్ నాయకుల సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌ను భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స అనంతరావు, చెప్పాల గణేష్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్, 11వ వార్డు కౌన్సిలర్ సంగ్య నాయక్, 8వ వార్డు కౌన్సిలర్ మమ్మరి సందీప్, మండల అధికార ప్రతినిధి వాక మహేష్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సేవాలాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

























