కోనాసముందర్ వడ్డెర కాలనీ చౌరస్తాలో ఐమాక్స్ లైట్ ఏర్పాటు..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీ వద్ద బషీరాబాద్, భీంగల్, మెండోర గ్రామాలకు వెళ్లే ప్రధాన చౌరస్తాలో ఐమాక్స్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
ఎంపీ సురేష్ రెడ్డి నిధుల నుంచి మంజూరైన రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ లైటింగ్‌ను శనివారం గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ.. గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు అవసరాన్ని ఎంపీ సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇందుకు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బషీరాబాద్ సర్పంచ్ బైకాన్ జమున మహేష్, చౌట్పల్లి సర్పంచ్ మహబూబ్, ఉపసర్పంచ్ బలే రావు శంకర్, మెండోర సర్పంచ్ కుంట రమేష్, సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























