పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ అనంతరావు తెలిపారు.
వికలాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా బాధితులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర పింఛన్‌దారులు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అందించే విధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు.
ఈ పథకానికి అర్హులైన వారు తమ ఆధార్ కార్డుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందజేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు.

























