ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ఆదేశాల మేరకు మండలంలోని ఫంక్షన్ హాళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఎస్బీఎం (SBM) 2026 నిబంధనల ప్రకారం ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా సహకరించాలని ఫంక్షన్ హాళ్ల యజమానులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

























