జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో.
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి: వీబీ–జీ రామ్జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచే లక్ష్యంతో శనివారం ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తండాలో చేపడుతున్న జల సంరక్షణ పనులను ఎంపీడీవో అనంతరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా జల సంరక్షణ పనుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.

























