ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కుటుంబ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
ఈ సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తూ వాటి అర్థాలు, ఆధ్యాత్మిక విశేషాలను సభ్యులకు వివరించారు.
భక్తి, ఆధ్యాత్మికతతో సాగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సామూహిక పారాయణంతో ధర్మశాల ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. చివరగా స్వామివారికి హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

























