Homeతెలంగాణప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్, నవంబర్ 2: భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్ (On Job Training) కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చెరుకుపల్లి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ గ్రూపులకు సంబంధించిన పాఠ్యాంశాల ఆధారంగా క్షేత్రస్థాయిలో శిక్షణ పొందాలని సూచించారు.

ఈ శిక్షణలో భాగంగా బ్యాంకింగ్ రంగం, వ్యవసాయ సహకార సంఘాలు, ఫిషరీస్ కేంద్రాలు తదితర సంస్థలను సందర్శించి ఆయా రంగాలకు సంబంధించిన ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అధ్యాపకులు ఇచ్చిన సూచనల ప్రకారం శిక్షణను పూర్తి చేయాలని, ఆయా సంస్థల్లోని అధికారుల నుంచి సమాచారాన్ని శ్రద్ధగా తెలుసుకొని హ్యాండ్‌బుక్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు, నిత్యజీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. శిక్షణతో పాటు మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు కూడా విద్యార్థులు సమర్థవంతంగా సిద్ధం కావాలని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి కళాశాలకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఫిషరీస్ గ్రూప్ అధ్యాపకులు ఎస్. శ్రీనివాస్, అకౌంటింగ్ అండ్ ట్యాలీ అధ్యాపకులు ధన్‌పాల్ క్రాంతి కృష్ణ, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ అధ్యాపకులు శోభారాణి, ఎస్. శ్రీకాంత్ తదితర అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్‌పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

0
నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా? టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు! సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన...

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

0
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు! రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్? సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు... త్రిశూల్ న్యూస్...

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

Translate »
error: Content is protected !!