Homeతెలంగాణఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్, నవంబర్ 3: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం ఉందని భీమ్‌గల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.

భీమ్‌గల్ మండలంలోని చెంగల్, బడా భీమ్‌గల్ గ్రామాల్లో రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో వ్యవసాయ రంగం ఎదుర్కొనే నీటి ఎద్దడి సమస్యలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఒక ఎకరం వరి సాగుకు సుమారు 30 నుంచి 40 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని, వరి సాగులో అధిక నీటి వినియోగం భూగర్భ జలాలపై ఒత్తిడిని పెంచుతోందని వివరించారు. భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించేందుకు ఇప్పటి నుంచే పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు.

తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యత

మొక్కజొన్న, జొన్న, కుసుమ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని తెలిపారు. నేల స్వభావం, వర్షపాతం, అందుబాటులో ఉన్న నీటి వనరులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

పంటల వైవిధ్యీకరణతోనే నీటి సమస్యకు పరిష్కారం

రైతులు ప్రతి సీజన్‌లో ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుతో నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని వివరించారు.

అలాగే పొలాల్లో అవసరానికి మించి నీటిని వినియోగించకుండా నీటి పొదుపు చర్యలు పాటించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని డి. స్నేహ రైతులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

0
నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా? టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు! సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన...

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

0
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు! రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్? సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు... త్రిశూల్ న్యూస్...

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

Translate »
error: Content is protected !!