Homeకామారెడ్డి జిల్లాప్రజా పాలనలో మరో సంక్షేమ పథకం.. ఇందిరమ్మ కుటుంబ బీమా...

ప్రజా పాలనలో మరో సంక్షేమ పథకం.. ఇందిరమ్మ కుటుంబ బీమా…

ప్రజా పాలనలో మరో సంక్షేమ పథకం.. ఇందిరమ్మ కుటుంబ బీమా

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయం: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ పథకాన్ని స్వాగతించారు.

ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా మరో కీలకమైన సంక్షేమ పథకాన్ని తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. కుటుంబంలో అనుకోని కారణాలతో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా లభించడంతో పాటు, ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ప్రజా పాలనలో సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేస్తూ, కొత్తగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ప్రజలకు వివరిస్తామని అన్నారు.

ఈ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

0
నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి  రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్‌పాల్ విజ్ఞప్తి... ఇందూరు: నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు...

భీమ్‌గల్‌లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క…

0
భీమ్‌గల్‌లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అతిథి గృహం నిర్మాణానికి భూమిపూజ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్,...

హోన్నాజీపేట్ మార్కెట్ యార్డులో ఐమాక్స్ లైట్ ఏర్పాటు…

0
హోన్నాజీపేట్ మార్కెట్ యార్డులో ఐమాక్స్ లైట్ ఏర్పాటు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని హోన్నాజీపేట్ గ్రామపంచాయతీ నిధులతో గ్రామంలోని మార్కెట్ యార్డులో ఐమాక్స్ లైట్‌ను...

హైదరాబాద్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి…

0
హైదరాబాద్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి... హైదరాబాద్ లో 87వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు (irc )కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ...

బీడీ యాజమాన్యంతో చర్చలు సఫలం.. కార్మికుల ఆందోళన తాత్కాలిక విరమణ!

0
బీడీ యాజమాన్యంతో చర్చలు సఫలం.. కార్మికుల ఆందోళన తాత్కాలిక విరమణ! 8 రోజుల పనికి అదనంగా మరో 2 రోజులు పెంపునకు యాజమాన్యం అంగీకారం.. కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్...

Translate »
error: Content is protected !!