Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి...

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని భీంగల్ పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కోరారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో ఈ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ పథకంలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఇప్పటికే ప్రభుత్వ ఇతర బీమా పథకాల పరిధిలో ఉన్నవారికి ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. అర్హులైన వారు డిసెంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ప్రజలకు పథకంపై అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణంలోని 12 వార్డులకు సంబంధించి వార్డు అధికారులు, ఆర్‌పీలు ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల సహకారంతో ప్రతి వార్డులోని అర్హులైన ప్రజలకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను సంప్రదించి, అర్హతను పరిశీలించుకొని బీమా పథకంలో నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ పరిశీలన…

0
భీంగల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలంలోని చెంగల్, పెద్దమ్మకాడి తండా, బడా భీంగల్ గ్రామాల్లో...

ధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన…

0
ధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ,...

ధర్పల్లి మండల ప్రజావాణికి 10 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల ప్రజావాణికి 10 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి...

హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం…

0
హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో, శాంతా-వసంత ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన బాలల సాంస్కృతికోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి...

ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా…

0
ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్...

Translate »
error: Content is protected !!