Homeతెలంగాణసాలూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి...

సాలూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి…

సాలూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఐదు అదనపు తరగతి గదులు మంజూరు.. ప్లే గ్రౌండ్, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు ఆదేశం…

నిజామాబాద్ జిల్లా : సాలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం ద్వారా తనిఖీ చేశారు. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజుశ్రీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఐదు అదనపు తరగతి గదులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాఠశాలకు ప్రహరీ గోడ, ప్లే గ్రౌండ్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై నేరుగా సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ రోజులు పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారు బడికి ఎందుకు రావడం లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ప్రతి విద్యార్థికి ఆధార్ సీడింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.

ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలను కూడా కలుపుకుని విద్యార్థులకు అనువుగా ప్లే గ్రౌండ్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ ఎనిమిదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. గణితంలో పలు ప్రశ్నలు వేసి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందజేసి అభినందించారు. పాఠశాలలో అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

ఈ తనిఖీలో ఇన్‌చార్జి డీఈఓ సాయాగౌడ్, తహసీల్దార్ ఎం.ఏ. నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

Translate »
error: Content is protected !!