ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన
చెలిమెల నరసయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం – నల్ల సారిక హనుమంత్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో భూ ఆక్రమణకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు చెలిమెల నరసయ్య చేసిన ఆరోపణలను ధర్పల్లి మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ఖండించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరసయ్య చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. దొంగతనం చేసిన వ్యక్తే దొంగ.. దొంగ అని అరిచినట్లుగా నరసయ్య వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సర్వే నంబర్ 195లో తన అనుచర వర్గానికి చెందిన వారు 8 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ నరసయ్య చేసిన ఆరోపణలు సరికావన్నారు. సదరు భూమి కొంతమంది దళితులకు చెందినదని, వారి తాతముత్తాతల కాలం నుంచి ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి అని తెలిపారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సమయంలో బాధితులకు తాను అండగా నిలిచానని, వారినే కబ్జాదారులుగా చిత్రీకరించడం తగదని పేర్కొన్నారు.
తాను బాజిరెడ్డి గోవర్ధన్‌కు ముఖ్య అనుచరుడినని, ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నానని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాజిరెడ్డి గోవర్ధన్ ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో పేదలు, దళితుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నానని నల్ల సారిక హనుమంత్ రెడ్డి స్పష్టం చేశారు.

























