చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి
ప్రియాంక మృతి పట్ల ఉపాధ్యాయులు, స్థానికుల సంతాపం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా : భీమ్గల్ మండలం పిప్రి (డిప్యూటేషన్ ) బాచన్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు గంజి ప్రియాంక ( 27 ) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది.
ప్రియాంక మృతి పట్ల ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ఆమె అకాల మరణం విద్యా వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఉపాధ్యాయురాలు మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఉపాధ్యాయులు, పిప్రి, బాచన్ పల్లి సర్పంచులు అరిగేల జనార్దన్, వన్నెల బాలమణి, జనార్దన్ సంతాపం వ్యక్తం చేశారు.

























