Homeతెలంగాణవైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ...

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ

రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ…

నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ వివరించారు. వైద్య విధాన పరిషత్, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీగా నమోదైన మొదటి రోజు నుంచే రక్తహీనత నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 0–59 నెలల చిన్నారులు, 5–9 సంవత్సరాల పిల్లలు, 10–19 సంవత్సరాల కౌమారదశ బాలబాలికలు, 19–49 సంవత్సరాల మహిళలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో రక్తహీనత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా డీఐఓ డాక్టర్ అశోక్ అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. 2026లో అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌గా మార్చినట్లు వివరించారు. రక్తహీనత నివారణకు ప్రతి ఒక్కరూ వయసుకు తగిన పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు. తీవ్రమైన రక్తహీనత ఉన్నవారికి అవసరాన్ని బట్టి ఐరన్ సుక్రోజ్ వంటి చికిత్సా విధానాలు అందించాలని తెలిపారు.

రక్తహీనత నివారణకు టి-4 విధానాన్ని పాటించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, రక్తహీనత బాధితులను గుర్తించడం, నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అవసరమైన చికిత్స అందించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవ్య మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులందరికీ హిమోగ్లోబిన్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్నవారికి తగిన చికిత్స అందించాలని సూచించారు. పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నులిపురుగుల కారణంగా కూడా పిల్లల్లో రక్తహీనత వచ్చే అవకాశం ఉందని, అందువల్ల సంవత్సరానికి రెండుసార్లు డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిఖరమాట్లాడుతూ.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు రక్తహీనత బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయిని బట్టి తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన రక్తహీనతగా విభజించి, తీవ్రతను బట్టి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు లేదా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ల ద్వారా చికిత్స అందించాల్సి ఉంటుందని వివరించారు. గర్భిణీగా నమోదైనప్పటి నుంచి ఆశా, ఏఎన్‌ఎంల ద్వారా రక్తహీనత నిర్ధారణ, చికిత్స అందించడంతో పాటు అంగన్‌వాడీ టీచర్ల ద్వారా పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన ఉప వైద్యాధికారులు డివిజన్ స్థాయిలో, వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, డీడబ్ల్యూఓ సౌందర్య, డీఐఓ డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ విద్య, డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవ్య, డాక్టర్ శిఖర, డాక్టర్ వెంకటేష్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈలు ఘనపూర్, వెంకటేశ్వర్లు, డీఐఈసీ మేనేజర్ సచిన్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన…

0
ధర్పల్లిలో భూ ఆక్రమణ ఆరోపణలపై మాజీ ఎంపీపీ ఖండన చెలిమెల నరసయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం – నల్ల సారిక హనుమంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!