Homeతెలంగాణడిచ్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పరామర్శలు...

డిచ్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పరామర్శలు…

డిచ్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పరామర్శలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ 

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శనివారం పరామర్శించారు.

ముందుగా మిట్టపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాసిపెద్ది పెద్ద రాజన్న ఇటీవల మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అదే గ్రామానికి చెందిన అవుసల ప్రభాకర్ అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారని తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం నడిపల్లి తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కళ్యాణ్ సోదరి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

డిచ్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ దాస్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులు అధికంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

తదనంతరం దూస్‌గాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏగొండా, మందా రెడ్డిలను వారి నివాసాల్లో వేర్వేరుగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహకారం అందిస్తామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, మునిపల్లి సాయిరెడ్డి, అమృతపూర్ గంగాధర్, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, రాంచందర్ గౌడ్, శ్యాంసన్, జహూర్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు…

0
గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... బుధవారం నాడు వన్నెల్ బి వరద కాలువ గట్టు పైన కొంతమంది చేరి గంజాయి తాగుతున్నారు అనే సమాచారం మేరకు బాల్కొండ...

ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ…

0
ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా...

Translate »
error: Content is protected !!