డిచ్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పరామర్శలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శనివారం పరామర్శించారు.
ముందుగా మిట్టపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాసిపెద్ది పెద్ద రాజన్న ఇటీవల మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అదే గ్రామానికి చెందిన అవుసల ప్రభాకర్ అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారని తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం నడిపల్లి తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కళ్యాణ్ సోదరి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
డిచ్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ దాస్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులు అధికంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తదనంతరం దూస్‌గాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏగొండా, మందా రెడ్డిలను వారి నివాసాల్లో వేర్వేరుగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహకారం అందిస్తామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబర్ సింగ్, మునిపల్లి సాయిరెడ్డి, అమృతపూర్ గంగాధర్, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, రాంచందర్ గౌడ్, శ్యాంసన్, జహూర్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























