Homeత్రిశూల్ న్యూస్దాతల సహకారంతో సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన...

దాతల సహకారంతో సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ…

దాతల సహకారంతో సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ…

వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, దాతలు ఎన్.సి. మూర్తి, జీవన్ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ జి. పోశయ్య, మాజీ ప్రిన్సిపాల్ ఎ. ధర్మారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముందు మంత్రి కొండా సురేఖకు కళాశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం చంద్రకాంతయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించగా, అతిథులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

అనంతరం దేశ్‌పాండే ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించి పరిశీలించారు.

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు అందించారు.

తదుపరి జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ జి. పోశయ్య, మాజీ ప్రిన్సిపాల్ ఎ. ధర్మారెడ్డి, దాత ఎన్.సి. మూర్తి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మంత్రి కొండా సురేఖ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

దాత ఎన్.సి. మూర్తి మాట్లాడుతూ, ఈ కళాశాలలో చదివి విదేశాల్లో స్థిరపడిన తమలాంటి పూర్వ విద్యార్థులు తమ స్వస్థల అభివృద్ధికి చేయూతనివ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

దాత జీవన్ మూర్తి మాట్లాడుతూ, సమాజానికి తిరిగి సేవ చేయగలగడం గొప్ప అవకాశమన్నారు. యువత నిరుద్యోగంతో బాధపడకుండా, కంప్యూటర్ నైపుణ్యాలు సాధించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో దేశ్‌పాండే ఫౌండేషన్ ద్వారా ఈ స్కిల్ ప్లస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చివరగా అతిథులు, దాతలను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…

0
ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్‌-జూనియర్ బాలికల జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక...

భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన...

0
భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి...

గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: – కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్…

0
గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: - కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ గ్రామంలో స్థానిక...

పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…

0
పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ...

ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

0
ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు...

Translate »
error: Content is protected !!