చేంగల్ లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైండింగ్ చోరీ…
పోలీసులకు రైతుల ఫిర్యాదు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైండింగ్‌ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్లిన సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమైనట్లు గుర్తించి పరిశీలించగా, అందులోని కాపర్ వైండింగ్‌ను దుండగులు అపహరించినట్లు తెలిసింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున గుర్తించగా, చోరీ సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడంతో వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనపై రైతు బద్దం రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను త్వరితగతిన మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని రైతులు కోరారు.

























