భారీ వర్షాల హెచ్చరిక.. పోతంగల్–కోటగిరి గ్రామాలకు అధికారుల కీలక సూచనలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ఎ గణేష్…
నిజామాబాద్ జిల్లా పోతంగల్, కోటిగిరి ఉమ్మడి మండలాల గ్రామాలకు భారీ వర్షాల కారణంగా అధికారులు తగు జాగ్రత్తలు మరియు సూచనలు గురించి. వచ్చే మూడు రోజులు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధిక వర్షాల నేపథ్యంలో ఈ క్రింది అంశాలపై ప్రత్యేక దృష్టిసారించగలరు. 1. పాత శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే కుటుంబాలను గురించి అవసరమైతే వారి బంధువుల ఇండ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలి.2. విద్యుత్ స్తంభాలు తెగిపోయిన విద్యుత్తు తీగలు మరియు ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అవగాహన కల్పించాలి. 3. గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలించి కూలిపోయే ప్రమాదం ఉన్న భవనాల్లో విద్యార్థులను కూర్చొని ఇవ్వకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలి.4. ఇళ్ల నష్టం పశువులు (ఆవులు,గేదలు,గొర్రెలు,మొదలైనవి) మరణాలు రహదారులు దెబ్బతినడం నీటి ప్రవాహం వల్ల రాకపోకలకు అంతరాయం లేదా ఇతర వర్ష సంబంధిత సంఘటనలు జరిగినట్లయితే వెంటనే మండల ఎంపీడీవో గారికి మరియు తాసిల్దార్ గారికి సమాచారం అందించాలి.5. మంజీరనదివద్దచేపలుపట్టడానికి,స్నానం చేయడానికి లేదా ఇతర అవసరాల నిమిత్తం ఎవరువెళ్లకుండా గ్రామాల్లో చాటింపు చాటింపు వేయించి ప్రజలకు కల్పించాలి.























