నేడు నిజామాబాద్‌లో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు పర్యటన…
తెలంగాణ : రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు శనివారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును వారు సందర్శించనున్నారు. అలాగే మంత్రులు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో మాట్లాడనున్నారు. స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించానున్నట్లు తెలుస్తోంది.























