ఆగస్టు 4 నుంచి నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రారంభం…
దేశంలోని వైద్య కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నీట్ యూజీ 2026 ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల విద్యా సంవత్సరం సెప్టెంబరు 8 నుంచి ప్రారంభమవుతుంది. తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు, రాష్ట్రాల కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరుగుతుంది.























