“నో పార్కింగ్” బోర్డు ఉన్నా పట్టించుకోని వాహనదారులు..!
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: మాధవ్ నగర్ బైపాస్ బ్రిడ్జి కింద “No Parking” బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, పలువురు వాహనదారులు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను అక్కడే నిలుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“నో పార్కింగ్” బోర్డు స్పష్టంగా ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు పార్క్ చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత పోలీసులు, ట్రాఫిక్ అధికారులు స్పందించి, ఆ ప్రాంతంలో అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

























