బెంగళూరులో ఘనంగా అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ
బీసీ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా హక్కుల సాధనకు ఉద్యమించాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్.కే. నగేష్ బెంగళూరు, ఆగస్టు
అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ బెంగళూరులో ఘనంగా నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ప్రతినిధులు మరియు వేలాది మంది బీసీ ఉద్యోగులు ఈ మహాసభకు భారీగా హాజరయ్యారు.
ఈ మహాసభలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పీసీసీ అధ్యక్షులు హరిప్రసాద్,బీసీ లా ఉద్యమ వీరుడు. జాజుల శ్రీనివాస్ ఈటల రాజేందర్ హనుమంతు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ వర్గాలకు 42 %రిజర్వేషన్ అమలు చేయాలి విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని, బీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
బీసీ ఉద్యోగుల సమస్యలు, సామాజిక న్యాయం, జనాభా ప్రాతిపదికన హక్కులు మరియు సముచిత వాటా వంటి అంశాలపై మహాసభలో విస్తృతంగా చర్చించారు. బీసీ ఉద్యోగులు, యువత మరియు ప్రజలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని నాయకులు పేర్కొన్నారు.
నిజామాబాద్ రీజియన్‌కు చెందిన బీసీ ఉద్యోగులు శ్రీనివాస్. కే. నగేష్ కే. రవీందర్ బి.స్ నారాయణ R. శ్రీనివాస్. లక్ష్మన్ దేవయ్య మారుతి లింబ సామి నిర్మల్ వెంకటేష్ నిర్మల్ శివకుమార్ చాలా పెద్ద సంఖ్యలో బెంగళూరుకు తరలివెళ్లి మహాసభలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.
మహాసభ విజయవంతం కావడం బీసీ ఉద్యమానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని బీసీ ఉద్యోగులు తెలిపారు.
జై బీసీ — జై జై బీసీ
బీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి
బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమం వర్ధిల్లాలి






















