ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం…
నిజామాబాద్ జిల్లాలోని మాకులూరు మండల్ మాదాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి తోటి పివిటిజీలు కులస్తులు ఏకమై మమేకమై ఆదివాసి ఆచార సాంప్రదాయ బద్దంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆకుపచ్చ ఆదివాసి జండా ఆవిష్కరింపజేశారు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పివిటిజి నిధులు తమకు అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం ఆదివాసీల్ని గుర్తించినప్పటికీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయం అని అన్నారు రాజ్యాంగపరంగా మాకు రావలసిన హక్కులను రాకుండా అడ్డుపడుతున్నది ఎవరో అర్థం కాలేని అమాయకత్వంలో నిత్యం అర్థం లేని అమాయకత్వంలో నిత్యం జీవించడం జరుగుతుందని ఇకనైనా తోటి సమాజానికి రావలసిన రాజ్యాంగపర హక్కులను అందించేలా అధికారులు నాయకులు పాలకులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొడపాల్ నారాయణ ఆదివాసి తోటి సంఘం జిల్లా అధ్యక్షులు కుడిమేత లక్ష్మణ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడావి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడప ప్రభాకర్ కోశాధికారి ఆత్రం జగన్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన నిజాంబాద్ జిల్లా ఆదివాసి తోటి నాయకులను చరణవాని ద్వారా ఆదివాసి తోటి సంక్షేమ సేవా సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుసంగ వేణు అభినందించారు




















