ధర్పల్లి ఎస్సీ కాలనీలో డెంగ్యూ కేసు నమోదు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం డెంగ్యూ కేసు నమోదైనట్లు ఎంపీఓ శ్రీధర్ తెలిపారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ కార్యదర్శి రాకేష్‌తో కలిసి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి రోగిని పరిశీలించారు. వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు.
బాధితుడి ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో డెంగ్యూ వ్యాప్తికి కారణమయ్యే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

























