సికింద్రాపూర్ ప్రాథమిక పాఠశాలలో టై, బెల్టు, ఐడి కార్డుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలంలోని సికింద్రాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు మూల నితీష్ రెడ్డి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టై, బెల్ట్, ఐడి కార్డులను శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు సమక్షంలో పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మూల నితీష్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.























