జాతీయ జెండాతో దేశభక్తి సందేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
త్రిశూల్ న్యూస్ , ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హోలీ ట్రినిటీ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసి జాతీయ జెండా గొప్పతనం, దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రహదారిపై వెళ్లే ప్రతి వాహనదారుడిని ఆపి జాతీయ జెండాను అందజేశారు. జాతీయ జెండా మన దేశానికి ప్రతీక అని, దాని గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని వివరించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశం పట్ల ప్రతి పౌరుడికి ఉండాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు.

























