లో వోల్టేజ్ సమస్యను తీర్చిన ముచ్కూర్ సర్పంచ్ కోడిగేల శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా వోల్టేజ్ సమస్యతో ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఈ లోవోల్టేజ్ సమస్యతో గ్రామంలోని వీధి దీపాలు గృహాలలో లైట్లు ఫ్యాన్లు సరిగా పనిచేయక ఇబ్బందికి గురైన గ్రామ ప్రజలు పిల్లలు వెలుతురులేక చదువుకోలేక లోవోల్టేజ్ సమస్యతో బాధపడటం జరిగేవి. సర్పంచ్ ఊరి ప్రజల కష్టాలను దగ్గరగా విని, వెంటనే గ్రామ పెద్దలు, వార్డు సభ్యులతో కలిసి మీటింగ్ పెట్టారు. తర్వాత విద్యుత్ శాఖ అధికారులను కలసి, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంచడం, లైన్లను మరమ్మతు చేయడం వంటి పనులపై చర్చించారు. సర్పంచ్ మాట్లాడుతూ, “ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం మా బాధ్యతగా తీసుకొని సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు తో నిరంతరం మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి నూతన ట్రాన్స్ఫార్మర్ ను
ముచ్కూర్ గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. విలేజ్ లో కొన్ని సంవత్సరాలు నుంచి ఉన్న లోవల్టేజ్ సమస్య తీరడంతో గ్రామ సర్పంచ్ కోడిగేల శ్రీనివాస్ ను గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

























