Homeతెలంగాణప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపిన కసాయి భార్య...

ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపిన కసాయి భార్య…

ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపిన కసాయి భార్య…

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు…

పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు…

వారి అన్యోన్య దాపంత్యానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లలు సంతానం…

అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు…

వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చుపెట్టింది…

తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ కసాయి భార్య… భర్తను పక్కా పథకం ప్రకారం లేపేసింది…

తర్వాత ప్రమాదమంటూ కట్టుకథ చెప్పి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఎవరా కంత్రీ.. ఖిలాడీ వైఫ్..?

ఇక్కడ కాలిన గాయాలతో అల్లాడిపోతున్న ఇతని పేరు పవన్ కుమార్.

ఊరు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆర్.ఆర్. సెంటర్.

ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు సంధ్యాబాయి. పవన్ కుమార్ భార్య. వీరిద్దరిది ప్రేమ వివాహం.

పవన్ కుమార్‌కు తల్లితండ్రులు బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిర్చారు.

అప్పటికే సంద్యాబాయితో ప్రేమలో ఉన్న పవన్ కుమార్ పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని కాదని అందరినీ ఎదిరించి మరీ సంధ్యాబాయిని 2017లో పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు ఏడేళ్ల ప్రేమ్ కుమార్, ఆరేళ్ల దేవాస్ నాయక్ ఉన్నారు.

పవన్ కుమార్ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

వారం రోజుల క్రితం పవన్ కుమార్ ఇంట్లో మంటలు చెలరేగాయి.

మంటలు అంటుకుని పవన్ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఏం జరిగిందని భార్య సంధ్యాబాయిని అడిగారు.

తన భర్త పవన్ కుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడని చెప్పింది.

ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. తర్వాత ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ చేయడంతో నిప్పంటుకుందని చెప్పింది.

దీంతో ఫైర్ సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు.

ఫైర్, పోలీసులు పవన్ కుమార్ ఇంటిని పరిశీలించారు.

అయితే ఇంట్లో ఎలాంటి గ్యాస్ లీకైనట్లు ఆనవాళ్లు కనిపించలేదు.

దీంతో భార్య సంధ్యాబాయిపై అనుమానం వచ్చింది.

అదే సమయంలో ఆసుపత్రిలో పవన్ కుమార్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా గ్యాస్ లీకవడం వల్ల గాయాలు కాలేదని.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుందని చెప్పారు.

దీంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది.

ఇక పవన్ కుమార్ బంధువులను కూడా పోలీసులు మరింత లోతుగా విచారించారు.

మృతుడు పవన్ కుమార్ బంధువులు సంద్యాబాయి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేశారు.

సంధ్యాబాయి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.

పవన్ కుమార్ మృతికి కారణం భార్య సంధ్యాబాయి అని ఆరోపించారు.

అంతేకాదు సంధ్యాబాయి ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందో కూడా వారి వివరాలు కూడా క్లియర్‌గా తెలిపారు.

పవన్ కుమార్ బంధువులు, కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారంతో సంధ్యాబాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు మరింత లోతుగా విచారించారు.

దీంతో పవన్ కుమార్ హత్య విషయం బయటకొచ్చింది.

వివాహేతర సంబంధం వ్యవహారం పవన్ కుమార్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనట్లు పోలీసుల విచారణలో సంధ్యాబాయి చెప్పుకొచ్చింది.

దీంతో ఇంట్లో నిద్రపోతున్న భర్త పవన్ కుమార్ పై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు అంగీకరించింది.

బయటకొచ్చి ఏమీ తెలియనట్లుగా గ్యాస్ లీకై మంటలు చెలరేగినట్లు చెప్పి తప్పించుకోవాలని చూసినట్లు కట్టుకథ చెప్పి అడ్డంగా బుక్కయ్యింది.

పవన్ కుమార్ హత్య వ్యవహారంలో సహకారం అందించిన మైనర్ తోపాటు కిరణ్ కుమార్, రమేష్‌లను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు…

0
గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... బుధవారం నాడు వన్నెల్ బి వరద కాలువ గట్టు పైన కొంతమంది చేరి గంజాయి తాగుతున్నారు అనే సమాచారం మేరకు బాల్కొండ...

ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ…

0
ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా...

Translate »
error: Content is protected !!