వచ్చే వారం నుంచే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు…
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచుతామని ఆయన చెప్పారు. మరోవైపు, ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.























