HomeతెలంగాణNRI సంక్షేమానికి సమగ్ర విధానం దిశగా తెలంగాణ అడుగులు...

NRI సంక్షేమానికి సమగ్ర విధానం దిశగా తెలంగాణ అడుగులు…

NRI సంక్షేమానికి సమగ్ర విధానం దిశగా తెలంగాణ అడుగులు…

ఫిలిప్పీన్స్‌లోని మనీలా పర్యటనకు 14 మంది సభ్యుల NRI సలహా కమిటీ..

విదేశీ ఉపాధి, భద్రత, పునరావాసంపై అధ్యయనం…

NRI సంక్షేమానికి కీలకంగా మారనున్న పర్యటన…

ఏపీ పర్యటన అనంతరం ఫిలిప్పీన్స్ లోనే..!

కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి..

తెలంగాణ నుంచి ఉపాధి, మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్తున్న యువత, వలసకార్మికులు, NRIల సంక్షేమానికి మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఫిలిప్పీన్స్‌లో NRIల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విధానాలు, కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 14 మంది సభ్యులతో NRI సలహా కమిటీని ఏర్పాటు చేసింది.

రిటైర్డ్ IFS అధికారి డా. వినోద్ కుమార్ చైర్మన్‌గా, మంద భీంరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అలాగే పలువురు ఎమ్మెల్యేలు, NRI రంగ నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఈ నెల 17 18, 19, 20, 21 తేదీల్లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా పర్యటించి అక్కడి NRI సంక్షేమ విధానాలను అధ్యయనం చేయనుంది.

NRIలే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్తున్న వారిలో అధిక సంఖ్యలో వలసకార్మికులు ఉన్నారని, విదేశాల్లో ఉన్న NRIలు కూడా మనవాళ్లేనని అన్నారు. వారి భద్రత, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత పునరావాసం వంటి అంశాలకు సమగ్ర విధానం అవసరమని పేర్కొన్నారు.

తెలుగు NRIల అధిక తలసరి ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానం చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. NRIలకు తమ సమస్యలను నిర్భయంగా ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడంతో పాటు, సచివాలయ స్థాయిలో అందుబాటులో ఉండే వ్యవస్థ దిశగా ప్రభుత్వం సాగుతోందన్నారు.

విదేశీ ఉపాధికి ముందస్తు శిక్షణ

యువత విదేశాలకు వెళ్లే ముందే వారికి అవసరమైన నైపుణ్యాలను అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఉన్న రంగాల్లో శిక్షణ, విదేశీ భాషల పరిజ్ఞానం, ఉద్యోగ విధానాలపై అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన అవకాశాలు పొందేలా చేయవచ్చన్నారు.

ఇమిగ్రేషన్ దశ నుంచే సమగ్ర ప్రణాళిక ఉండాలని, విదేశాలకు వెళ్లిన తర్వాత ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, ఉపాధి ఇబ్బందులు, ఇతర సమస్యలకు తక్షణ సహాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు .24 గంటల పర్యవేక్షణ, లీగల్ సెల్, సీసీ కెమెరాల ఆధారంగా ఇంటర్వ్యూ ప్రక్రియ పర్యవేక్షణ వంటి ఆధునిక విధానాలను పరిశీలించనున్నట్లు తెలిపారు.

గల్ఫ్‌తో పాటు యూరప్‌ వైపు దృష్టి

ప్రస్తుతం విదేశీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకే కాకుండా యూరప్‌లోని పలు దేశాలకు కూడా యువతలో ఆసక్తి పెరుగుతోందని భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఆయా దేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య అవసరాలను గుర్తించి తెలంగాణ యువతను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

NRIలతో అనుసంధానం కోసం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను పెంచడంతో పాటు, వారిని ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విదేశాల్లో స్థిరపడిన వారు తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు ఉపాధి, పెట్టుబడులు, సామాజిక అనుసంధానం వంటి అంశాల్లో సహకారం అందించే NRI Re-integration విధానాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదివరకే ఏపీ పర్యటన ముగించుకున్న అడ్వైజరీ కమిటీ

NRI ల సంక్షమార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం అడ్వైజరీ కమిటీ ఇదివరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పర్యటనను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో ఆ ప్రభుత్వం NRI ల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధివిధానాల పై సంగ్రంగా చర్చించారు. ప్రభుత్వం పెద్దలు, NRI నిపుణులతో సమావేశం నిర్వహించి అనేక అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి నైపుణ్య కార్యక్రమాలు

తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు, ITIలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసి వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

టాస్క్, టామ్‌కామ్ తదితర సంస్థల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విదేశీ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై మరింత దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

NRIలకు భరోసా కల్పించే చర్యలు

వివిధ కారణాలతో విదేశాల్లో మృతి చెందిన NRIల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని భూపతి రెడ్డి తెలిపారు. NRIల సమస్యల పరిష్కారానికి లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో అమలు చేస్తున్న ప్రవాసి ప్రజావాణి వంటి కార్యక్రమాలపై కూడా ఫిలిప్పీన్స్ పర్యటనలో చర్చించనున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి సులభంగా తీసుకురావడానికి మరింత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించడమే లక్ష్యమన్నారు.

అధ్యయన నివేదిక ఆధారంగా ప్రత్యేక NRI పాలసీ

ఫిలిప్పీన్స్ పర్యటనలో లభించే అనుభవాలు, అక్కడ అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం, తెలంగాణ పరిస్థితులపై సమీక్ష ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక NRI పాలసీని రూపొందించే అవకాశం ఉంది.

ఈ విధానం అమల్లోకి వస్తే విదేశాలకు వెళ్లే యువతకు ముందస్తు నైపుణ్య శిక్షణ నుంచి విదేశాల్లో భద్రత, ఉపాధి, న్యాయ సహాయం, 24 గంటల పర్యవేక్షణ, తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత పునరావాసం వరకు ఒక సమగ్ర వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

నిజామాబాద్ జిల్లా వాసులకే అధిక ప్రయోజనాలు

తెలంగాణ రాష్ట్రం నుండి అంతర్జాతీయంగా వలస వెళ్తున్న వారిలో నిజామాబాద్ జిల్లా ముందువరుసలో ఉంది. ఇక్కడి వారు ఎక్కువగా నిర్మాణ రంగం, డ్రైవింగ్ మరియు ఇతర కార్మిక పనుల కోసం గల్ఫ్ దేశాలను ఎంచుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా నుండి ఉపాధి కోసం ప్రతి ఏటా వేలాది మంది విదేశాలకు వెళుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలు (దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర) మరియు ఇతర విదేశాల్లో సుమారు 50,000 నుండి 70,000 మందికి పైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. అధికారిక లెక్కల కంటే అనధికారికంగా టూరిస్ట్ వీసాలపై వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు.

ఈ పర్యటన నివేదిక ఆధారంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం NRI పాలసీ రూపొందిస్తే మొదటగా ప్రయోజనం నిజామాబాద్ జిల్లా వారికే కలగనుంది.

విదేశీ ఉపాధిని కేవలం వలసగా కాకుండా.. తెలంగాణ యువతకు మెరుగైన అవకాశాలు, NRIలకు భద్రత, రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి అందించే భాగస్వామ్యంగా మలచడమే ఈ పర్యటన, ప్రతిపాదిత NRI పాలసీ ప్రధాన లక్ష్యంగా నిలవనుంది.

దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఒక కొత్త మార్గదర్శకత్వంగా రానున్న NRI పాలసీ మారనుంది. ఉపాధి అవకాశాలు కల్పించడం, విదేశాల్లో బ్ల్యూ కాలర్ ఉద్యోగాలకు ముందస్తుగానే ఇక్కడి నుండి శిక్షణ కల్పించడం , నైపుణ్యాలు పెంపొందించడం తదితర రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

Translate »
error: Content is protected !!