సిపితో ప్రశంసలందుకున్న హోంగార్డ్ రమేష్ నాయక్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బానోవత్ రమేష్ నాయక్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. మంచి క్రమశిక్షణతో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను ఆయనకు పంద్రాగస్టు సందర్భంగా సిపి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు . సిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న రమేష్ నాయక్ ను సిఐ జాన్ రెడ్డి,ఎస్ఐ వినయ్ కుమార్, నందిపేట టౌన్ సిబ్బంది, మిత్రులు అభినందించారు.























