సిపితో ప్రశంస పత్రాన్ని అందుకున్న నందిపేట పోలీసులు….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
నిజామాబాద్ జిల్లా నందిపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మంచి క్రమశిక్షణతో
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ కానిస్టేబుల్ షబ్బీర్2919 , ఆర్మీలో పదవి విరమణ పొంది మళ్లీ పోలీస్ ఉద్యోగంలో చేరిన కాకర్ల శ్రీనివాస్ 2952, చాలా కాలం నుండి హోంగార్డుగా సేవలందిస్తున్న భానోత్ రమేష్ నాయక్ 608 లకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సిపి సాయి చైతన్య, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. మన సమాజంలో ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణకై పోలీసులు అహర్నిశలు కృషి చేస్తుంటారు. నగరం నిద్దుర పోతుంటే నడిరోడ్డుపై విధులు నిర్వహించే పోలీసులకు ప్రతి ఒక్కరు అభినందనలు తెలపాల్సిందే. అటువంటి ఉద్యోగంలో మంచి క్రమశిక్షణతో ఉత్తమ ప్రశంస పత్రాలను అందుకున్న ఆ ముగ్గురికి సిఐ జాన్ రెడ్డి, ఎస్సై వినయ్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఉమ్మడి నందిపేట మండలం ప్రజలందరూ అభినందనలు తెలుపుతున్నారు.

























