కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై షబ్బీర్ అలీ ఇంటిముట్టడి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారి ఇంటిముట్టడి…
ఈ సందర్భంగా ఎబివిపి SWC మెంబర్ చరణ్ గారు మాటలుకామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేని కారణంగా షబ్బీర్ అలీ గారి ఇంటిని ముట్టడించడం జరిగింది గత ఐదేళ్ల నుండి ప్రభుత్వ కళాశాలలో సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు, నీళ్లు, బెంచులు, లేని కారణంగా విద్యార్థులు చెట్టు నీడలో పాఠాలు చెప్పే పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉంటే మారుమూల మండల కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు అర్థమవుతుంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలకు ఏ నాయకుడైన ఏ అధికారైన వచ్చి విద్యార్థుల యొక్క స్థితిని తెలుసుకోలేకపోతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి గారు రైజింగ్ తెలంగాణ చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఉంటే మరోవైపు విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్న వాళ్లని పట్టించుకోకపోవడం కచ్చితంగా విద్య వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ముట్టడితో స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ శశి, కౌశిక్ , అల్తాఫ్ స్వస్తిక్, అజాబ్, రాజు, భరత్, తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

























