తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసిన తాళ్ళరాంపుర్ వీడీసీ బాధితులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
గ్రామ బహిష్కరణ,వెలివేయడం వంటి చర్యలపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ నీ కోరిన – మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వీడీసీ లను తక్షణమే రద్దు చేయాలని కోరిన – బట్టు శ్రీధర్ .వీడీసీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు. చట్టబద్ధత లేని వీడీసీ లను రద్దు చేయాలి – ఐ ఎల్ పి ఎరాష్ట్రఅధ్యక్షులు.అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్. న్యాయం జరిగే వరకు పోరాడుతాం తాళ్ళరాంపూర్ బాధితులు. హైదరాబాద్ లోని డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో తాళ్ళరాంపూర్ గ్రామ వీడీసీ బాధితుల తో కలిసి రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ గారిని కలిసిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ,ఐ ఆల్ పి ఎ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ దేవరాజ్,వీడీసీ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు బట్టు శ్రీధర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్,బాల్కొండ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధించడం,వాటిని వ్యతిరేకించిన వారిని గ్రామ బహిష్కరణ,సామాజిక వెలివేతకు గురిచేయడంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ మేరకు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.కల్లు గీయడం,చేపలు పట్టడం–అమ్మడం,చావు డప్పులు మోయడం,గడ్డం గీయడం,బట్టలు ఉతకడం వంటి కులవృత్తులపై ఆంక్షలు విధించడం వల్ల వృత్తి కులాల జీవనోపాధికి తీవ్రఇబ్బందులుఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంక్షలను వ్యతిరేకించిన వారిని గ్రామ బహిష్కరణచేయడం,మాట్లాడకుండాచేయడం,ఆలయాల్లోకి రాకుండా అడ్డుకోవడం,పాలు–నీళ్లు ఇవ్వకుండా ఆదేశించడం వంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన అని,మనిషి యొక్క హక్కులకు విరుద్ధమని అన్నారు.అనంతరం పలు గ్రామాల సమస్యలను వారికివివరించారు..వేల్పూరు మండలంలోని రామన్నపేట జక్రాన్ పల్లి సావెల్ ఇందలవాయి మండలంలోని గన్నారం లో అనేక అకృత్యాల పాల్పడుతున్నారని వాపోయారు.నాయి బ్రాహ్మణులు, రజకులు, గొల్ల–కురుమలు,గీతకార్మికులు,మత్స్యకారులుఎదుర్కొంటున్నసమస్యలపైసమగ్రవిచారణజరిపి,బాధితులకు న్యాయంచేసి,బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.అలాగే వీడీసీ నిరోధక చట్టం చేసి.. బాధితులకు అండగా నిలబడుతూ.. శిక్షార్హులను వారినికఠినంగాశిక్షించాల్సిందిగా కోరడం జరిగింది.ఈ సందర్భంగా అడ్వకేట్ ఆంజనేయులు,బాధితులు సుదర్శన్,నర్సాగౌడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.























