బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రికార్డుల నిర్వహణ, పెండింగ్ దస్తాల పరిష్కారంపై అధికారులకు ఆదేశాలు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల తీరును పరిశీలించారు.
వివిధ రికార్డులు, దస్తాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రికార్డులను క్రమబద్ధంగా, భద్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న దస్తాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
కార్యాలయానికి వచ్చే ప్రజలకు సత్వర, మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి సారించి, దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలో కొనసాగుతున్న భూసేకరణ పనుల పురోగతిని పరిశీలించి, ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
భూసేకరణ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, ఆర్డీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ గంగాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఎంపీడీవో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

























