Homeతెలంగాణగాంధీజీకి నిత్య పూజలు... నర్సింగ్‌పూర్‌లో ప్రత్యేక ఆచారం...

గాంధీజీకి నిత్య పూజలు… నర్సింగ్‌పూర్‌లో ప్రత్యేక ఆచారం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

గాంధీ జయంతి అనగానే గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం మహాత్మా గాంధీని దైవంగా భావిస్తూ నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నర్సింగ్‌పూర్ గ్రామస్తులు అనాదిగా వస్తున్న ఈ ప్రత్యేక ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా తొలి దైవంగా మహాత్మా గాంధీని పూజించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

గ్రామంలో పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు లేదా ఇతర శుభకార్యాలు ఏవి జరిగినా… ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేయడం తప్పనిసరి అని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇతర ప్రాంతాలకు భిన్నంగా నర్సింగ్‌పూర్ గ్రామస్తులు మహాత్మా గాంధీని దైవంగా భావిస్తూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. చూసేవారికి ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించినా… గ్రామస్తులు మాత్రం తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున మహాత్మా గాంధీని స్మరించుకుంటారు. కానీ నర్సింగ్‌పూర్ గ్రామస్తులు మాత్రం నిత్యం ఆయనను స్మరించుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడిన మహాత్మా గాంధీని దైవంతో సమానంగా భావిస్తూ… తమ గౌరవాన్ని, దేశభక్తిని చాటుకుంటున్నారు నర్సింగ్‌పూర్ గ్రామస్తులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!