నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
దేవి మండపం నిర్మాణానికి భూమిపూజ.. కర్ర పూజ నిర్వహించిన శర్వాణి కమిటీ సభ్యులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేవి మండపం నిర్మాణానికి శర్వాణి కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా కర్ర పూజ కూడా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు శర్వాణి కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలోరఘు పంతులు శర్వాణి కమిటీ అధ్యక్షుడు గంగాధర్, బోధిరే నరసయ్య, పురస్తు బద్రి, బొధిరే తిరుపతి,శంకర్, అశోక్,నీలం రమేష్ , శ్రీనివాస్, జగన్, గంగాధర్, లింబాద్రి ,బో ల్లన్న తో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

























