చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి భారీ స్పందన
ప్రముఖ సినీ నటి శ్రీముఖి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరు…
కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీముఖి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మాల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగీతం, డోలు వాయిద్యాలతో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ప్రారంభోత్సవానికి కామారెడ్డితో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ ప్రాంగణం జనసందోహంతో కిటకిటలాడింది.
ప్రారంభోత్సవం అనంతరం వినియోగదారులు వివిధ రకాల చీరలు, మహిళల దుస్తులు, పిల్లల దుస్తులు, మెన్స్‌వేర్ తదితర వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, 49 మంది వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపార ప్రముఖులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కొత్త షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భారీ జనసందోహంతో కామారెడ్డి పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.
చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

























