క్యాన్సర్ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు.
యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో ఆధునిక సాంకేతికతతో క్యాన్సర్ చికిత్స…
క్యాన్సర్ చికిత్సలో ఆధునిక వైద్య సేవలు యశోద హాస్పిటల్‌లోని క్యాన్సర్ విభాగం రోగుల అవసరాలకు అనుగుణంగా సమగ్ర క్యాన్సర్ చికిత్సను అందిస్తోంది. ఆధునిక వైద్య పరీక్షల ద్వారా వ్యాధి పరిస్థితిని అంచనా వేసి, ప్రతి రోగికి తగిన చికిత్సా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
క్లిష్టమైన క్యాన్సర్ కేసుల్లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు కలిసి రోగి పరిస్థితిని సమీక్షించి, తగిన చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తున్నారు.
కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్‌కు సంబంధించిన అత్యవసర పరిస్థితులను కూడా వైద్య బృందం నిర్వహిస్తోంది.
రోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డే-కేర్ కీమోథెరపీ సేవలను అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి రోబోటిక్ సర్జరీ, HIPEC వంటి ఆధునిక చికిత్సా విధానాలను కూడా అందుబాటులో ఉంచారు.
ఆధునిక వైద్య సాంకేతికతతో పాటు నిపుణులైన వైద్యుల సమన్వయంతో క్యాన్సర్ రోగులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించేందుకు యశోద హాస్పిటల్ కృషి చేస్తోందని మెడికల్ ఆంకాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ భరత్ ఏ. వాస్వాని, మార్కెటింగ్ మేనేజర్ శ్రీరామ్ సురేష్ తెలిపారు.

























