రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్ల ఎంపిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-13 బాల బాలికల జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఆదివారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్అధ్యక్షులు.వి.ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి.మర్కంటి గంగామోహన్మాట్లాడుతూ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి.మర్కంటి గంగామోహన్ మాట్లాడుతూ ఎంపికైన బాలికల జట్టు రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 11, 12 తేదీలలో జెడ్పిహెచ్ఎస్ తొర్లికొండ క్రీడా మైదానంలో, బాలుర రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 16,17 తేదీలలో ఎల్.బి.కాలేజ్ క్రీడా మైదానం,హనుమకొండ జిల్లాలోనిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా బాల బాలికల జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ ఎంపిక కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి చెప్ప నవీన్,వ్యాయామఉపాధ్యాయులువి.నాగభూషణం,నరేంద్రచారి,రమేష్,స్వప్న,వీణ,భూలాభాయ్,ఎల్. శివకుమార్,తిరుపతి,జిల్లా కోచ్లు.నరేష్,అనికేత్, మౌనిక,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.























