అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి.3లక్షల విలువ చేసే ఎల్.ఓ.సి లెటర్ అందజేసిన ఎమ్మేల్యే…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డా.ఆర్.భూపతి రెడ్డి. నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధిఉపయోగపడుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ.ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. పేర్కొన్నారు.డిచ్ పల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బర్కుంట రాజు భాయ్.అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.శస్త్ర చికిత్స నిమిత్తం రూ.3లక్షలు ఖర్చుఅవుతుందని వైద్యులు సూచించారు. దీంతోరూ3లక్షలకుసంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలసని శ్రీనివాస్ స్థానిక గ్రామస్తుల నేతృత్వంలో బాధితులకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.























