గుక్కెడు నీటి కోసం కాలనీవాసుల తిప్పలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
ఆరు రోజులుగా మోటార్ మరమ్మతులు పూర్తి కాక తీవ్ర ఇబ్బందులు.. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం….
కామారెడ్డి పట్టణంలోని పాత పట్టణం, ఓల్డ్ గల్లీ ప్రాంతాల ప్రజలకు గుక్కెడు తాగునీటి కోసం తిప్పలు తప్పడం లేదు.
జోన్-1 పరిధిలోని గడి వాటర్ ట్యాంకు సంపు మోటార్ ఆరు రోజుల క్రితం కాలిపోవడంతో ఇప్పటికీ మరమ్మతులు పూర్తికాలేదు.
దీంతో 25, 26, 27, 28, 30, 44, 45, 46, 47వ వార్డుల పరిధిలోని సుమారు 30 వేల మంది ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మోటార్ మరమ్మతుల్లో జాప్యం జరుగుతున్నా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం స్పందించకపోవడంపై స్థానికులు, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసినా సరైన స్పందన లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుండగా ఒక్క ట్యాంకర్‌కు రూ.600 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి వస్తోంది.
ఈ ఖర్చు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత జూలైలోనూ ఇదే మోటార్ చెడిపోవడంతో ప్రజలు రోజుల తరబడి నీటి కోసం అవస్థలు పడ్డారని స్థానికులు గుర్తుచేశారు.
మోటార్‌కు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ప్రత్యామ్నాయంగా స్టాండ్‌బై మోటార్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే మోటార్ మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు, కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

























