Homeతెలంగాణదుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి...

దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి…

దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం.మండపం వద్ద విధ్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలి.వర్షం సందర్భంగా మండపం పైన పాల్తీన్ కవర్స్ వాడాలి.రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి : పోలీస్ కమిషనర వెల్లడి.దుర్గామాత నవరాత్రి విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదు. దుర్గామాత నవరాత్రి మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వవలెను.దుర్గామాత నవరాత్రి మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై యువతులపై ” ఈవ్ టీజింగ్ ” జరుగ -కుండా చూడవలెను. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్ / హై ఫిడిలిటి (హై ఫై ) సౌండ్ సిస్టమ్ ఇక్విప్మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలి. కొద్ది మంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు,బి.పి గలవారు, వయసు పై బడిన వృద్ధులు ఉంటారు. మరియు చదువుకునే విద్యార్థులకు ఆటంకము కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్టి సౌండ్ 12 Decibels దాటి ఉండరాదు. రాత్రి 10-00 గంటలకు “లౌడ్ స్పీకర్లు” ఆఫ్ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి.లేని యెడల చట్ట రిత్య చర్యలు తీసుకొనబడును.డి.జే లు పూర్తిగా నిషేదం పర్మీషన్ తీసుకోవాలి. మైక్ పర్మీషన్ కోసం సంబంధిత ఎ.సి.పి ని సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.విధ్యుత్ సరఫరా ఆగకుండా వీధి దీపాలు వెలిగేటట్లు చూడవలెను.షార్టు సర్కూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. ప్రజలకు అసౌకర్యం కలుగజేసే ఎటువంటి చిన్న సమాచారాన్ని అయిన మీ దగ్గరలోని పోలీసులకు తెలుపండి. లేదా డయల్ 112 కు ఫోన్ చేయగలరు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126-59700 కు తెలపాలి. ప్రతీ దుర్గామాత మండలి వద్ద ఉదయం వేళలో మరియు రాత్రి వేళలో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్లను మండలి వద్ద ఉంచవలెను. పోలీస్ వారు చెకింగ్ కు వచ్చినప్పుడు ప్రతీసారి కనబడవలెను. మండపము దగ్గర అసాంఘిక చర్యలు లేకుండాచూసుకోనవలయును.ప్రతి దుర్గామాత మండలి దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేశారు.అపరిచిత ” వ్యక్తుల గూర్చి సమాచారం తెలియజేలి మీ దగ్గరలో ఎవ్వరయిన అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచూలు వదిలినట్లయితే వాటిని తాకరాదు. అట్టి సమాచారం దగ్గరలోని పోలీస్ అధికారులకు తెలుపండ.దుర్గామాత నవరాత్రి మండలి మొక్క పూర్తి వివరములు, నిమజ్జనం కొరకు ఏ రోజు ఎక్కడికి, ఏ మార్గం ద్వారా వెళ్తారనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే దుర్గామాత ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను. ( పై భాగంలో రేకులు ప్లాస్టిక్ కవర్లతో ఏర్పాటు చేయాలి. వర్షపు నీరు లోపలికి రాకుండా ఉండడం దుర్గామాత ప్రతిమలు కూర్చుండబెట్టే వేదిక చాలా బలంగా ఉండేటట్లు చూసుకోవాలి. మేకలు, ఇతర జంతువులు రాకుండా తగు జాగ్రత్తలు తీసికోవాలి దుర్గామాత మండలి వద్ద పూజా కార్యాక్రమంలో “క్యూ” పద్దతి పాటించాలి. ” బారికేడ్లను ” విధిగా ఏర్పాటు చేసుకోవాలి.ప్రత్యేకంగా లైటింగ్ సౌకర్యం కోసం మంచి నాణ్యత గల వైరుతో ప్లాస్టిక్ పి.వి.సి పైప్ ద్వారా లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి.పూర్తి సురక్షితమైన కవరుతో ఉన్న ఫ్లడ్ లైట్లను మాత్రమేవాడాల దుర్గామాత మండలి వద్ద ఏప్పుడైన అగ్ని ప్రమాదంసంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ,రెండు బకెట్ల ఇసుక ఏర్పాటు చేసుకోవాలి, మరియు ఫైర్ బాల్స్ సమకూర్చుకోవాలి.యువకులు కోపతాపాలకు వెళ్లకుండా ” సంయమనం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి.ఎటువంటి ” రూమర్స్” (పుకార్ల) ను నమ్మరదు ప్రజలకు అసౌకర్యం కలుగ కుండా నిరంతర ” పోలీస్ నిఘా ఏర్పాటు చేయబడింది. సంబంధిత నిర్వాహకులు అవసరం నిమిత్తంఉపయోగించుటకొరకు మీ దగ్గరలోని పోలీస్ సిబ్బంది ఫోన్ నెంబర్లను వ్రాసి పెట్టు కోనగల. నిర్వాహాకులు మండపాల దగ్గర వచ్చే భక్తులను ” క్యూ ” లో నిలబెట్ట వలెను.వారి వాహానాలను పద్దతి ప్రకారంగా పార్కింగ్ చ దుర్గామాత మండలి భక్తులు నిర్వాహకులు మద్యపానానికి దూరంగ ఉ దుర్గామాత మండలి వద్ద” పేకాట ఆడరాదు దుర్గామాత ఉత్సవాలలో “టపాసుల ” నిషేదం గలదు నిమజ్జనం రోజు పోలీసు వారు జారీ చేసిన నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాన్ని (రథాన్ని) ” క్యూ” లో ఉండే విధంగాచర్యలుతీసుకోగలరు.ప్రతీ రథానికి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలనిమజ్జనం రోజు వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ జనసమూహం ఉన్నప్పుడు “దొంగతనాలకు” అ స్కారము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిల్లర దొంగల పై జాగరూకత వహించాలి.నిమజ్జనం రోజు భజన కార్యక్రమం చేసేవారు సంబంధిత దాన్ని అనుకరిస్తూ భక్తి భావంతో మెలుగవలెను.పర్మీషన్ తీసుకొనవలెను.నిమజ్జనం రోజు వారి వారి అను కూలనుసారం “బావులలో చెఱువులలో,కాలువలలో లేదా గోదావరిలో మొదలగు చోట్ల వేసేటప్పుడు పెద్దవారు మాత్రమే ముందుకు వెళ్లి విగ్రహన్ని వేయాలి. ప్రత్యేకంగా ఈత వచ్చిన వారు ఉండవలెను. పోలీస్ వారి సూచనల మేరకు నిమజ్జనం చేయవలను. నిమజ్జనం రోజు కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలు వెల్లడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతీ దుర్గామాత నిమజ్జనం చేసే రోజు తప్పక పెద్దవాళ్లు ఉండవలెను. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా ఇంటికీ చేరు కోవలెను.కొన్ని మారుమూల గ్రామాలలోని ప్రజలు గ్రామ శివారులో గల చెఱువులో లేదా నీటి గుంత లలో దుర్గామాత నిమజ్జనం చేయాడానికిప్రయత్నిస్తారు. అటువంటి వాటిలో గతంలోనే “ప్రొ క్లేన్స్ “ద్వారా పెద్ద పెద్దగా మట్టిని తీసివేయడం వలన అక్కడ నీరు ఎక్కువగా నీల్వ ఉన్నా కాని కొద్దిగా ఉన్నట్లు కనబడును. కావున ఇటువంటి ప్రదేశాలలో సంబందిత పెద్ద వారు సరియైన జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరానుకూలంగా సి.సి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి.నిమజ్జనంచేసే సమయంలో ఎవ్వరు కూడా విన్యాసాలు చేయకూడదు. సెల్ఫోన్తో సెల్ఫీలుదిగవద్దు.దుర్గామాత విగ్రహం తీసుకొని వచ్చే రోడ్డులో కాని దుర్గామాత విగ్రహం తీసుకొని వెళ్లే రూటులో కాని ఎంత ఎత్తు గలదో అట్టి దారి పొడవున ముందుగానే చూసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు పాటించవలెను.ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడు సహకరించవలెను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!